Thursday, May 16, 2024
- Advertisement -

ఉపాసనను కష్టపెడుతున్న రామ్ చరణ్

- Advertisement -
ram charan tej gym workout video posted by upaasana

మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ.. విభిన్న పాత్రలను చేస్తూ.. తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే చరణ్ కి మొదటి నుంచి బాడీ ఫిట్ నెస్ పై కాస్త శ్రద్ధ ఎక్కువే. చరణ్ ఎప్పుడు ఫిట్ గా ఉంటారు. అయితే తాజాగా ఆయన మరింతగా జిమ్ కు వెళ్లటం మొదలెట్టారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ధృవ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్ర కోసం చరణ్ తన బాడీని మరింత ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అయితే చరణ్ ఒక్కరే.. జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తున్నారా అంటే… లేదు తనతో పాటు తన భార్యను కూడా తీసుకు వెళ్తున్నారు. రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కలిసి జిమ్ లో తెగ కష్టపడుతున్నారు.

చరణ్ అయితే తన సినిమా కోసం జిమ్ చేస్తున్నారు. తనతో పాటు నాకు కూడా చెమటలు పట్టిస్తున్నారు అని ఉపాసన వెల్లడించింది. తన భర్త చరణ్ తో కలిసి జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఒక వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}inhyBl-AlVM{/youtube}

Related

  1. రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
  2. రామ్ చరణ్ తో ప్రభాస్!
  3. మెగా హీరోయిన్‌తో అఖిల్ రొమాన్స్‌..!
  4. మెగాస్టార్ తో స్టెప్పులేసిన మంచు ల‌క్ష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -