Friday, April 19, 2024
- Advertisement -

ఇన్​స్టాలో దుమ్మురేపిన చెర్రీ..!

- Advertisement -

మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్ తేజ్​ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. ఇన్​స్టాలో చెర్రీ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్లకు చేరుకుంది. మెగాస్టార్​ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్​.. చాలా తక్కువ టైంలోనే భారీ మార్కెట్​ను సొంతం చేసుకున్నాడు. నటుడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర బ్లాక్​బ్లస్టర్​గా నిలవడంతో చెర్రీ క్రేజ్​ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత రంగస్థలం సినిమా విడుదల అయ్యాక మంచి నటుడిగానూ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక సామాజిక కార్యక్రమాల్లోనూ చెర్రీ ముందుంటున్నాడు.

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్​ బ్యాంకులను ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించాడు రామ్​చరణ్​. ప్రస్తుతం రామ్​చరణ్​ .. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యలో ఓ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో పాటు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్​ ఇండియా మూవీ ఆర్​ఆర్​ఆర్ లో అల్లూరి సీతారామారాజు పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్​ తుదిదశకు చేరుకున్నది. కరోనాతో షూటింగ్​ ఆగిపోగా.. సోమవారం నుంచి మళ్లీ షూటింగ్​ ప్రారంభం అయ్యింది.

ఆ మూవీ పూర్తయిన వెంబడే తమిళ సెన్సేషనల్​ డైరెక్టర్​ శంకర్​తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా పాన్​ ఇండియా లెవెల్​లో రాబోతున్నది. ఇప్పటికే ట్విట్టర్ లో పెద్ద సంఖ్యలో ఫాలో వర్స్ ని సంపాదించుకున్నాడు రామ్ చరణ్. తాజాగా ఇన్​స్టా గ్రామ్ లో కూడా చెర్రీ ఫాలో అవుతున్న వారి సంఖ్య 4 మిలియన్లకు చేరుకుంది.

Also Read

నా కొడుకుకు రూ.3 కోట్ల కారు కొనలేదు .. సోనూ సూద్​ క్లారిటీ..!

పెళ్లంటే నరకం..! అంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -