Saturday, April 20, 2024
- Advertisement -

నా కొడుకుకు రూ.3 కోట్ల కారు కొనలేదు .. సోనూ సూద్​ క్లారిటీ..!

- Advertisement -

కరోనా మొదటి వేవ్​ టైం నుంచి సోనూ సూద్​ రియల్​ హీరోగా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. అందుకు కారణం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే. వలసకూలీలు మొదలు వ్యవసాయదారుల వరకు.. చిరువ్యాపారులు మొదలు చిరుద్యోగుల వరకు ఎవరు కోరినా సాయం చేయడం మొదలు పెట్టాడు సోనూ .. ప్రాంతం, కులం, మతం, భాషా భేదం లేకుండా సాయం అడిగిన ప్రతిఒక్కరినీ ఆదుకున్నాడు.

కరోనా మొదటివేవ్​లో ఆర్థిక సాయం చేసిన సోనూ సూద్​​.. ఇక సెకండ్​వేవ్​లోనూ తన సేవలు కొనసాగించాడు. ఆక్సిజన్​ కూడా పంపిణీ చేసి దేవుడయ్యాడు. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నెలకొల్పాడు. దీంతో సోనూ సూద్​ కు వచ్చిన పేరు ప్రఖ్యాతులతో ఆయనకు సంబంధించిన​ వ్యక్తిగత విషయాలు, వ్యాపారం ఇలా ప్రతి అంశం వార్తల్లోకి ఎక్కుతోంది.తాజాగా సోనూ సూద్​​ తన పెద్ద కుమారుడు ఇషాన్​కు ఫాదర్స్ డే సందర్భంగా రూ. 3 కోట్ల విలువైన ఓ కారును బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

సోనూ సూద్​ తన ​ ఇంటికి కారును తీసుకెళ్తున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. దీంతో ఈ విషయంపై సోనూ సూద్​​ క్లారిటీ ఇచ్చాడు. నా కుమారుడికి నేను అసలు ఏ కారు బహుమతిగా ఇవ్వలేదు. నాకు నా ఫ్యామిలీతో గడపడానికే సమయం ఉండటం లేదు. ఎంతో బిజీగా ఉన్నాను. నేను వాళ్లతో ఉండటమే వాళ్లకు నేను ఇచ్చే బహుమతి. అయితే ఓ కారును ట్రయల్స్​ కోసం మా ఇంటికి తీసుకొచ్చిన విషయం నిజమే.. అయితే ఆ కారును మేము కొనుగోలు చేయలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు సోనూ సూద్​​. ప్రస్తుతం సోనూ సూద్​ ఆచార్య సినిమాలో విలన్​గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు పలు తమిళ, బాలీవుడ్​ చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నాడు.

Also Read

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

అలియాభట్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -