శేఖర్ కమ్ముల సినిమాకు ధనుష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వైవిధ్యభరితమైన యూత్ ఫుల్ కథాంశంతో సాగే సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీగా తెలుగు,తమిళ్,హిందీ భాషలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది.

శేఖర్ కమ్ముల, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న ఈమూవీ దాదాపుగా ఖరారు అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ధనుష్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది .

- Advertisement -

Also read:చిరంజీవి లేటెస్ట్ లుక్ చూశారా.. ఎంత బాగుందో?

హిరో ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ వస్తున్న సినిమాలో ధనుష్ కు జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. ప్రస్తుతం హీరో ధనుష్ బాలీవుడ్లో “అత్రాంగిరే” సినిమాలో నటిస్తున్నాడు.అలాగే హాలీవుడ్లో “దిగ్రేమ్యాన్‌” వంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also read:మహేశ్‌, ప్రభాస్‌ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సుబ్బరాజు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -