Friday, April 19, 2024
- Advertisement -

ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమా..!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో జార్జియాలో జరగనున్న షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం చివరి షెడ్యూల్ నడుస్తోంది.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత రామ్ చరణ్ ప్రభాస్ హోమ్ థియేటర్ అయిన యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ,ప్రమోద్ చరణ్ తో కూడా సన్నిహితంగా ఉంటారు. ఆ కారణంగానే వారి బ్యానర్ లో ఓ మూవీ చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

చరణ్ తో సినిమా చేసేందుకు ప్రస్తుతం అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుముల లైన్లో ఉన్నారు. గతంలో వెంకీ కుడుముల చరణ్ ని కలిసి ఓ కథ చెప్పాడని..ఆ కథ కూడా చరణ్ కు బాగా నచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిజం కాదని ఆ తర్వాత తేలింది. మరి ఈ ముగ్గురు డైరెక్టర్లలో చరణ్ సినిమా కోసం ఎవరిని ఎంపిక చేస్తారో వేచిచూడాల్సి ఉంది. చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో చరణ్ సినిమా ఉంటుంది.

Also Read : బిగ్​బాస్​ 5 డేట్​ ఫిక్స్​.. కంటెస్టెంట్లు ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -