హీరోగా అకీరా నందన్ లాంచ్ కన్ఫామ్.. కసరత్తులు మొదలెట్టేశాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కుమారుడు అకీరా నందన్. కొన్నేళ్ల కిందట పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. అకీరా నందన్, పవన్ చిన్న కుమార్తె ఆద్య రేణు దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. కొన్నేళ్లుగా పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ ఇటీవలే తన నివాసాన్ని హైదరాబాద్ కు మార్చుకుంది. అకీరా నందన్ ను హీరోగా లాంచ్ చేయడం కోసమే ఆమె హైదరాబాద్ లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్, రేణు దేశాయ్ వేర్వేరుగా ఉంటున్నా పిల్లలు మాత్రం పవన్ కు సన్నిహితంగానే మెలుగుతున్నారు. ఇటీవల తరచూ అకీరా నందన్ పవన్ వెంట కనిపిస్తున్నారు. ప్రస్తుతం అకీరా నందన్ వయసు 16ఏళ్లు. హైట్ 6.4..టాలీవుడ్ లో ప్రభాస్, రానా కూడా ఇంత హైట్ లేరు. స్టార్ హీరో అయ్యేందుకు కావాల్సిన ఫీచర్స్ అన్ని అకీరాలో కనిపిస్తున్నాయి. ఇంకొన్నేళ్లలో అకీరాను హీరోగా పరిచయం చేసేందుకు ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. పవన్ నటించిన పలు సినిమాల్లోని ఫైట్స్ లో మార్షల్ ఆర్ట్స్ కనిపిస్తుంటాయి. పవన్ నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు సినిమాల్లో రియల్ గా మార్షల్ ఆర్ట్స్ చేశాడు పవన్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు అకీరా నందన్ కు కూడా అన్ని విధాలుగా శిక్షణ ఇప్పించేందుకు పవన్, రేణు దేశాయ్ సమాయత్తం అవుతున్నారు. కొద్దిరోజుల కిందట పవన్, అకీరా ఓ సీనియర్ సింగర్ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నట్లు స్వయంగా తెలియజేసిన విషయం తెలిసిందే.

తాజాగా అకీరా నందన్ కర్రసాము నేర్చుకుంటున్నాడు. అకీరా కర్రసాము చేస్తున్న సమయంలో వీడియో తీసిన రేణు దేశాయ్ దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకీరా తండ్రికి తగ్గ తనయుడు అని మెచ్చుకుంటున్నారు. అకీరా ఆ వీడియోలో కర్రసాము అలవోకగా చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read: బిగ్​బాస్​ 5 డేట్​ ఫిక్స్​.. కంటెస్టెంట్లు ఎవరంటే?

Related Articles

Most Populer

Recent Posts