జనవరి 12న పవన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడంటే..!

- Advertisement -

వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలు నటించిన సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్,పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మలయాళ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించారు.

అయితే ఆ సినిమా ఏ డేట్ లో విడుదలవుతుందో క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జనవరి 12 వ తేదీన పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కానుంది. దీంతోపాటు ఈ సినిమాకు సంబంధించి మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు మేకర్స్. అతి త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల కానుంది.ఇందుకు సంబంధించి ఓ ప్రోమో వీడియో తాజాగా విడుదల చేశారు.

అందులో సింగర్ శ్రీ కృష్ణ పాట పాడుతూ ఉండగా తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు. హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, సాగర్ చంద్ర పాట వింటూ కనిపించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరోగా రానా నటిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి పవన్ కళ్యాణ్,మహేష్ బాబు, ప్రభాస్, సినిమాలతో పాటు నాగార్జున బంగార్రాజు, వెంకటేష్,వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 విడుదల కానుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.

Also Read: బిగ్​బాస్​ 5 డేట్​ ఫిక్స్​.. కంటెస్టెంట్లు ఎవరంటే?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -