బిగ్​బాస్​ 5 డేట్​ ఫిక్స్​.. కంటెస్టెంట్లు ఎవరంటే?

బిగ్​బాస్ తెలుగులో ఎంతో ప్రేక్షకాదరణ ఉన్న ఓ గేమ్​ షో. ఈ షోలో కంటెస్టెంట్లుగా ఎవరు పాల్గొనబోతున్నారు? హోస్ట్​ ఎవరు? ఏ వారం ఎవరు? ఎలిమినేట్​ కాబోతున్నారు? తదితర విషయాలపై ప్రేక్షకుల్లో ఆదరణ ఉంటుంది. ఇక బిగ్​బాస్​ షోలో టీఆర్పీ రేటింగ్​లు పెంచుకొనేందుకు చేసే పిచ్చి పిచ్చి గేమ్​ ల వల్ల యువత, చిన్నపిల్లలు చెడిపోతున్నారన్న వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. దాదాపు అన్నీ సక్సెస్​ అయ్యాయి.

మొదటి షోకు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ హోస్ట్​గా వ్యవహరించగా.. రెండో సీజన్​లో నానీ హోస్ట్​గా వ్యవహరించాడు. ఇక మూడు, నాలుగు సీజన్ల నాగార్జున అక్కినేని హోస్ట్​గా వ్యవహరించాడు. ఐదో సీజన్​కు ఎవరు? హోస్ట్​గా వ్యవహరంచబోతున్నారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది. మళ్లీ నాగార్జునే వస్తాడన్న వార్తలు వచ్చాయి. నాగార్జున విదేశాల్లో షూటింగ్​లో బిజీగా ఉండటం వల్ల.. రానా హోస్ట్​ గా రాబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా మా టీవీలో బిగ్​బాస్​ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్​ అయ్యింది. సెప్టెంబర్​ 5 నుంచి ఈ షో ప్రారంభం కాబోతున్నదని సమాచారం. ఈ సారి కంటెస్టెంట్లుగా హీరోయిన్​ ఇషా చావ్లా, యాంకర్​ వర్షిణి, యాంకర్​ రవి, ప్రముఖ నటి సురేఖా వాణి, బుల్లితెర నటులు నవ్య స్వామి, సిద్ధార్థ్​ వర్మ, యాంకర్​ లోబో, సింగర్​ మంగ్లీ, టీవీ 9 యాంకర్​ ప్రత్యూష, టిక్​టాక్​ స్టార్​ దుర్గారావు, యూట్యూబ్​ వివాదాస్పద యాంకర్​ శివ, యూట్యూబ్​ నటుడు షుణ్ముఖ్​ జస్వంత్​ కంటెస్టెంట్లుగా రాబోతున్నారని టాక్​. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read

తగ్గేదెలా అంటున్న వెంకీ మామ..!

తెలుగు రాష్ట్రాల్లో మెమోజీల వివాదం

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Related Articles

Most Populer

Recent Posts