Wednesday, May 22, 2024
- Advertisement -

ఎక్స్‌క్లూజివ్ః మగధీర స్టైల్‌లో మగధీరను మించి రామ్ చరణ్ రాజమార్తాండ

- Advertisement -

రాజుల కాలం నాటి కాల్పనిక కథలతో ఇండస్ట్రీ హిట్స్‌ని మించి హిట్స్ కొట్టిన రాజమౌళిలాగే బోయపాటు శ్రీనుకు కూడా రాజసం, హీరోని మహా రాజులను మించిన వాడు అనే స్థాయిలో చూపించడం బాగా ఇష్టం. అయితే ఇప్పటి వరకూ బోయపాటికి ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టే నిర్మాత దొరకలేదు. మరోవైపు దమ్ము సినిమాలో మగధీర ఇన్‌స్పిరేషన్‌తో ఎన్టీఆర్‌పై ఒక వెరైటీ సాంగ్‌ షూట్ చేస్తే అది కాస్తా విమర్శల పాలైంది. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీనుకు అలాంటి అవకాశం మళ్ళీ వచ్చిందని తెలుస్తోంది. చారిత్రక, రాజుల కాలం నాటి సినిమాలను రాజమౌళి రేంజ్‌లో తాను కూడా తెరకెక్కించగలను అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు బోయపాటి.

తాజాగా రామ్ చరణ్‌తో బోయపాటి తీస్తున్న ‘రాజమార్తాండ’ సినిమాలో మగధీర సిినిమాలో లాగే రాజుల కాలం నాటి ఫ్లాఫ్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. మగధీర సినిమాలోలాగా సెకండ్ హాఫ్‌లో ఎక్కువ భాగం ఉంటుందా……నిడివి ఎంత ఉండే అవకాశం ఉంది అన్న వివరాలు తెలియట్లేదు కానీ ఈ రాజుల కాలం నాటి ఎపిసోడ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ రామ్ చరణ్ చేసే యుద్ధం ఎపిసోడ్ ఒకటి మాత్రం ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. మగధీర సినిమాలో రామ్ చరణ్ గుర్రపు స్వారీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందని……..ఇప్పుడు బోయపాటి సినిమాలో గుర్రపు స్వారీ చేస్తూ రామ్ చరణ్ చేసే యుద్ధం అంతకుమించి అనే స్థాయిలో ఉంటుందని బోయపాటి యూనిట్ చెప్తోంది. ఈ గుర్రపు స్వారీ యుద్ధం ఎపిసోడ్ బాహుబలి రేంజ్‌లో ఉంటుందని…చరణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా, మెగా ఫ్యాన్స్ అందరికీ మెమొరబుల్‌గా ఉండే రేంజ్‌లో ఈ ఎపిసోడ్‌ని బోయపాటి తెరకెక్కించనున్నారని చెప్తున్నారు. ప్రజెంట్ ట్రెండ్ సినిమాల్లోనే బోలెడంత రాజసం, హీరోలను చక్రవర్తులను మించి అనే స్థాయిలో చూపించే బోయపాటి ఇక రాజుల కాలం నాటి కథలో హీరోను ఏ రేంజ్‌లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. గుర్రపు స్వారీలో రామ్ చరణ్‌కి మించిన హీరో ఇండియాలోనే లేడని గుర్రపు స్వారీ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ప్రొడ్యూసర్ కూడా ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడకపోవచ్చు. ఇక రాజమౌళి స్థాయిలో నేను కూడా చారిత్రక, భారీ సినిమాలు తీయగలను అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం బోయపాటిదే. బోయపాటి తనను తాను ప్రూవ్ చేసుకుంటే మాత్రం రొటీన్ కథల నుంచి కాస్త బయటికి వచ్చి ముందు ముందు రాజమౌళి స్టైల్‌లోనే చందమామ కథల్లాంటి రాజుల కథలను చాలానే తెరపై వీక్షించే అవకాశం తెలుగు ప్రేక్షకులకు అయితే ఉండే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -