Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ అలా అంటే నాకు ఇష్టం… షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్మ!

- Advertisement -

వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎవరి మీద సినిమా తీస్తాడో, ఎప్పుడు ఎవరి మీద కౌంటర్లు వేస్తాడో ఎవరికీ తెలియదు. వర్మ తాజా పరిణామాలపైన, వివాదాస్పద ఘటనల పైన సినిమాలు చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. శివ సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్‌ డైరెక్టర్‌గా మారాడు.

రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నాకు నచ్చిన పొలిటిషియన్ పవన్ కల్యాణ్ అని, రాబోయే రోజుల్లో రాజకీయ వేత్తగా ఆయనకు పేరు వస్తుందో లేదో తెలియదు కానీ ఆయన నాకు చాలా ఇష్టం. పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేస్తాడనే నాకు పెద్దగా ఆసక్తి లేదు అని రాంగోపాల్ వర్మ అన్నారు. ఆయనతో సినిమా అంటే చాలా అంశాలు, కమర్షియల్ విలువల గురించి ఆలోచించాలి. ఆ కెపాసిటీ నాకు లేదు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.నేను సూపర్ స్టార్స్‌తో సినిమా చేయలేను. కేవలం యాక్టర్లతో మాత్రమే సినిమాలు చేస్తాను అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

Also read:13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో సినిమా షూటింగ్స్, రిలీజ్ ఆగిపోగా ఆర్జీవీ మాత్రం వరస సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాడు.ఇటీవల రాజశేఖర్‌తో దెయ్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో స్టార్ యాక్టర్స్ నటించడం విశేషం. తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం జీవిత కథతో డీ కంపెనీ అనే అతిపెద్ద వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.

Also read:త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -