త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం నుంచి ఒక స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. ఒకవైపు కమర్షియల్ పాత్రలలో నటిస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ పాత్రలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇకపోతే మే 4త్రిష పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా #HappyBirthdayTrisha, #HappyBirthdayTrishaKrishnan, వంటి హ్యాష్ ట్యాగ్ లతో సందడి చేశారు. ఇదిలా ఉండగా.. త్రిష చిన్ననాటి స్నేహితురాలు టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఛార్మి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

Also read:ట్రైన్ లో బాత్రూం వద్ద పట్టుకున్నారంటూ గుట్టు విప్పిన సీనియర్ నటి రజిత!

 “హ్యాపీయెస్ట్ బర్త్ డే” త్రిష అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..నీకు ఇదే నీ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అని నాకు అనిపిస్తుంది అంటూ పేర్కొంది. అంటే త్రిష త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ గుడ్ బై చెబుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందని ఛార్మి ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లు తెలుస్తోంది.గత కొద్ది రోజులుగా త్రిష ఒక బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపించడంతో త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తోంది.

Also read:వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -