Wednesday, May 15, 2024
- Advertisement -

కరోనాతో మాఫియా డాన్ చోటా రాజన్ మృతి

- Advertisement -

ముంబై చీకటి సామ్రాజ్యానికి ఒకప్పటి రారాజు, మాఫియా డాన్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన చోటా రాజన్ (62) కరోనాతో కన్నుమూశాడు. ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తోన్న గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ఇక లేడు. తీహార్ జైలులో కరోనా కాటుకు గురైనా ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. గత సోమవారం చోటా రాజన్ కరోనా లక్షణాలు ఉన్నాయంటూ తీహార్ జైలు అసిస్టెంట్ జైలర్ టెలిఫోన్ ద్వారా అక్కడ సెషన్స్ కోర్టుకు సమాచారం ఇచ్చారు.

దీంతో గ్యాంగ్‌స్టర్ ను కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించి ఎయిమ్స్‌లో చేర్పించినట్లు తెలిపారు. 61 ఏళ్ల రాజన్ 2015 లో ఇండోనేషియాలోని బాలి నుండి బహిష్కరించబడిన తరువాత అరెస్టు అయినప్పటి నుండి న్యూ ఢిల్లీలోని హై-సెక్యూరిటీ తీహార్ జైలులో ఉన్నారు. చోటా రాజన్ భారత్ నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటూ మాఫియాను నడిపేవాడు.

ఇంటర్ పోల్ సాయంతో 2015లో అతణ్ని ఇండోనేసియాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. ఢిల్లీలోని హైసెక్యూరిటీ తీహార్ జైలుకు తరలించారు.ముంబైలో 2011లో ఓ జర్నలిస్టును హత్య చేసినట్లు నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో ఛోటా రాజన్‌కు 2018లో జీవిత ఖైదు విధించారు. అయితే హనీఫ్ లక్డవాలా హత్య కేసులో రాజన్, ఆయన సహచరుడు నిర్దోషులని ఇటీవలే ముంబైలోని సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.

బిగ్ బాస్ సీజన్ 5 ఏ నెలలో వస్తుందో తెలుసా?

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజులో 46 మంది మృతి!

ఆ స్టార్ హీరోలపై కన్నేసిన నిధి అగర్వాల్… మాములు జోరు కాదుగా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -