తెలంగాణలో కర్ప్యూ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాజిటివిటీ రేటు పెరుగుతుండడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ప్యూ విధించే అవకాశం ఏమైనా ఉందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 3.6 శాతంగా ఉందనీ , పాజిటివిటీ రేటు గనుక 10 శాతం పెరిగితేనే నైట్ కర్ప్యూ , ఆంక్షల అమలు వంటివి అవసరం ఉంటాయని వైద్య అధికారులు సూచించారని కోర్టుకు న్యాయవాదులు తెలిపారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని కోర్టుకు వివరించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరం ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడడాన్నితప్పని సరిగా చేశామని చెప్పారు. వేడుకలు, సమావేశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని కోర్టుకు వివరించారు.

Also Read: ఇండియన్ క్రికెట్ లో ముసలం

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -