‘నాట్యం’ నుంచి ’పోనీ పోనీ ఈ ప్రాణమే…’ సాంగ్ రిలీజ్..!

- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు చిత్రాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా అంటేనే ఇక హిట్ అని ఫిక్స్ అయిపోవాలి. ఇక తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం “నాట్యం”. కొత్తదర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ గానే కాకుండా, స్క్రిప్ట్ రైటర్ గా, కెమెరామెన్ అండ్ ఎడిటర్ గా కూడా బాధ్యతలు వ్యవహరిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక ఈ సినిమా టీజర్ ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల విడుదల అయ్యింది. ఈ టీజర్ మంచి స్పందన వచ్చింది. ప్రముఖ నాట్య కళాకారిణి అయిన సంధ్యారాజు హీరోయిన్ గా ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి ప్రధానంగా ఈ సినిమా ఉండబోతోంది. అంతేకాదు, టీజర్ లోనే సినిమా ఎలా ఉండబోతోంది అనేది చెప్పేశారు. టీజర్ చూస్తుంటే సంధ్యారాజు నటన ఎంతో అద్భుతంగా ఉంది. తెరకు కొత్తైనా స్వతహాగా నర్తకి కావడంతో చక్కని హావభావాలతో నాట్యం సినిమాకి ప్రాణం పోశారనే చెప్పాలి. డైరెక్టర్ కె. విశ్వనాథ్ సప్తపది సినిమా, సాగరసంగమం సినిమాలని గుర్తు చేసేలా ఉంది ఈ టీజర్.

ఈ సినిమా నుంచి వెంకటేశ్ చేతుల మీదుగా ఒక సాంగును రిలీజ్ చేయించారు. ” పోనీ పోనీ ఈ ప్రాణమే .. కళకై జరిగే ఓ త్యాగమే, ప్రేమే చిందించే రక్తమే .. కళకందించే ఆరాధనే” అంటూ ఈ పాట సాగుతోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం హైలెట్ గా నిలిచింది. అక్టోబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Also Read

చీర.. బొట్టు.. గాజులు.. పూలు.. హాట్ హాట్ గా రష్మికా ఫస్ట్ లుక్..!

రాత్రి త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

జీడిప‌ప్పు ఆరోగ్య ర‌హ‌ష్యాలు

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -