Saturday, April 27, 2024
- Advertisement -

రాయలసీమ బ్యాక్​డ్రాప్ లో రవితేజ మూవీ..!

- Advertisement -

మాస్​ మహారాజ రవితేజ క్రాక్​తో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. తనకు మార్కెట్ ఇంకా పదిలంగానే ఉందని నిరూపించుకున్నాడు. గతంలో వరస పరాజయాలతో ఇబ్బందులు పడ్డ రవితేజకు.. క్రాక్​తో హిట్​ దొరికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి రవితేజ మరో విభిన్నమైన మూవీలో నటించబోతున్నట్టు సమాచారం.. 1990 లో జరిగిన ఓ కథలో ఆయన నటిస్తున్నాడట. ఈ మూవీలో రవితేజ.. రాయలసీమ బిడ్డగా.. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా నటించబోతున్నాడట.

వేషభాషలు ఆహార్యంలో రాయలసీమ.. యాస, భాషతో అలరిస్తాడట రవితేజ. ఈ సారి కొత్త దర్శకుడు శరత్‌ మండవకు ఆయన అవకాశం ఇచ్చినట్టు సమాచారం. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్​గా సెలెక్ట్​ అయినట్టు టాక్​. ఇక పోతే ఈ మూవీలో రవితేజ గెటప్​ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారట.

రవితేజ తన కెరీర్​లో ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ రోల్​లో తొలిసారి నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ ఖిలాడి మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోగానే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

Also Read

బన్నీ అస్సలు తగ్గేటట్టు లేడుగా..!

టక్​ జగదీశ్​ విడుదలకు అడ్డంకులు తొలగినట్టేనా?

బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్​ మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -