సినిమాలో చిన్న చిన్న పాత్రలో నటించి టీవీ ప్రోగ్రామ్స్ తో బాగా ఫాపులర్ అయ్యింది అందాలా భామ శ్రీముఖి. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చాటుతుంది. అయితే శ్రీముఖి యాంకర్ కన్న ముందు డాక్టర్ కావాలనుకుందట. డాక్టర్ కావాలన్నది ఆమె కల అట.
అందుకోసమే కష్టపడి చదివిందట. కానీ అనుకోకుండా చదువు పక్కనబెట్టేసి యాంకర్ గా మారిపోవాల్సి వచ్చిందని అంటోంది శ్రీముఖి. అసలు ఈమె యాంకర్ గా అవతారమెత్తడానికి దారి తీసిన కారణాల ఏంటో చూద్దాం..
శ్రీముఖి మాటలు చూసి ఈ ముద్దుగుమ్మ తెలుగమ్మాయి అనుకుంటాం కానీ.. ఆమె నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అట. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా.. తల్లి బ్యుటీషియన్. వీళ్ల ఫ్యామిలీ చాలా ఏళ్ల కిందటే నిజామాబాద్ వచ్చి సెటిలైంది. మంచి చదువరి అయిన శ్రీముఖి.. పదో తరగతి 95 శాతం మార్కులతో పాసైందట. ఆ తర్వాత డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంటర్ చేరి.. ఎంసెట్ కోసం కష్టపడి చదవిందట. ఐతే ఎంబీబీఎస్ సీటుకు అవసరమైన ర్యాంకు రాకపోవడంతో బీడీఎస్ లో చేరింది. ఐతే బీడీఎస్ సెకండియర్లో ఉండగా ఈటీవీలో ప్రసారమయ్యే హోం మినిస్టర్ కార్యక్రమానికి స్నేహితులతో కలిసి హాజరవడం.. అక్కడ ప్రోగ్రాం డైరెక్టర్ ఆమెను చూసి యాంకర్ గా ట్రై చేయమని అడగడం.. తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించడం.. ఈటీవీలో వచ్చే ‘అదుర్స్’ ప్రోగ్రాంకు శ్రీముఖి యాంకరింగ్ చేసి మంచి పేరు సంపాదించడం.. ఆ తర్వాత మరిన్ని ప్రోగ్రాములతో బిజీ అవడం చకచకా జరిగిపోయాయి. స్టార్టింగ్ లో తెలుగు సరిగా రాక ఇబ్బంది పడ్డా.. తర్వాత తెలుగుపై పట్టు సాధించింది శ్రీముఖి. అయితే యాంకర్ గా ఎంత ఫాపులర్ అయిన డాక్టర్ కావాలన్నది తన కల అని అంటోంది శ్రీముఖి.
Related