Wednesday, April 24, 2024
- Advertisement -

యాంకర్ రవిపై అషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు?

- Advertisement -

సోషల్ మీడియా పుణ్యమా అంటూ టిక్ టాక్ లు, డబ్ స్మాష్ ద్వారా ఎంతోమంది అమ్మాయిలు సెలబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా పేరు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత బుల్లితెరపై వెండితెర పై పలు అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే నితిన్ నటించిన “చల్ మోహనరంగ” సినిమాలో ఓ కీలక పాత్రలో చేశారు. అలాగే బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న అషు రెడ్డి ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే అషు రెడ్డి స్టార్ మాలో ప్రసారమయ్యే “కామెడీ స్టార్స్” కార్యక్రమంలో ఎక్స్ ప్రెస్ హరితో రొమాన్స్ చేయడంతో ఈమెపై పెద్దఎత్తున పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరి మధ్యన లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వినిపించడంతో హరి తనకు అన్నయ్య లాంటివాడు అని చెబుతూ ఈ విధమైనటువంటి వార్తలకు చెక్ పెట్టింది. ఇకపోతే అషు రెడ్డి యాంకర్ గా అవతారమెత్తి “హ్యాపీడేస్” అనే కార్యక్రమానికి యాంకరింగ్ నిర్వహిస్తున్నారు.

Also read:తమిళ్ వచ్చింటే హీరో కృష్ణ ఆ పని చేసేవారట!

ఈ కార్యక్రమానికి యాంకర్ రవితో పాటు యాంకరింగ్ చేస్తున్న అషు రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో అషు రెడ్డి రవి పై డబుల్ మీనింగ్ డైలాగ్ లను పేలుస్తూ షో మొత్తం సందడి చేశారు. ఈ షోలో భాగంగా అదిరిపోయే పంచ్ డైలాగులతో,స్టూడెంట్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ షో మొత్తం సందడి చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ యాంకర్ రవిని ఉద్దేశించి ఈ విధంగా ప్రశ్నించారు. మీరు ఎంతో మంది యాంకర్లతో చేశారు కదా.. అని అడుగుతుండగానే అషు రెడ్డి మధ్యలో అందుకొని ‘యాంకర్లతో ఏం చేశాడు’ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడింది. దీంతో రవి ఆమె వైపు తెల్లముఖం వేసుకుని చూశాడు. ఈ విధంగా అషు రెడ్డి మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్ స్టూడెంట్ కి అర్థం అవడంతో పగలబడి నవ్వు కున్నారు. ఇలా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడంతో అషు రెడ్డి పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also read:బాలీవుడ్ లో పక్కపక్కన ఉంటున్న స్టార్స్ వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -