Thursday, March 28, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ స్పీచ్‌పై రాంగోపాల్ వర్మ ట్వీట్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కామెంట్ చేశారు. భీమ్లానాయక్ ప్రీరిలీజ్ వేడుక బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో చిత్ర బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని ఒక యుద్ధం ఈ సినిమా అని వ్యాఖ్యానించారు.

అయితే పవన్ స్పీచ్‌పై తాజాగా రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారు. ట్విటర్‌ వేదికగా పవన్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ స్పీచ్‌ ఎంతో హూందాగా, అద్భుతంగా ఉందన్నారు ఆర్జీవీ. ఆయన ప్రవర్తన, ప్రాతినిధ్యం వహించిన తీరు మర్యాదపూర్వకంగా ఉంది.

అందుకే ఆయన్ని స్టార్స్‌ అందరిలోకెల్లా పవర్‌ఫుల్‌ అనేది’’ అని ట్వీట్‌ చేశారు. అనంతరం పవన్‌ స్పీచ్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘‘ఇప్పటి వరకూ పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన స్పీచ్చుల్లో ఇదే ది బెస్ట్‌. ఎంతో భావోద్వేగంగా, హృదయపూర్వకంగా, వినయంగా ఉంది’’ అని రాసుకొచ్చారు.

300 కోట్లతో ధనుష్ కొత్త ఇల్లు.. అందుకోసమే..?

ఆదిపురుష్ లో ప్రభాష్ పాత్ర పేరు రాముడు కాదు

అదిరిపోయే స్టెప్స్ వేసిన మ్యూజిక్ డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -