Wednesday, April 24, 2024
- Advertisement -

అదిరిపోయే స్టెప్స్ వేసిన మ్యూజిక్ డైరెక్టర్

- Advertisement -

‘సరిలేరు నీకెవ్వరు’ భారీ హిట్ కొట్టడంతో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’పై అంతకు మించి అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ బాబు, స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 12న విడుదల కానుంది. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్,14 రీల్స్ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘కళావతి’ యూట్యూబ్లో దూసుకుపోతోంది. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ పాట ఇప్పటికే 40 మిలియన్ వ్యూస్తో దుమ్మురేపుతోంది. ఈ పాటపై ఇప్పటికే అనేక మంది రీల్స్ చేసి అలరించారు. మహేశ్ బాబు కుమార్తె సితార, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కళావతి సాంగ్పై అదిరిపోయే స్టెప్పులు వేశారు.

తాజాగా ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కళావతి సాంగ్కు అదిరే స్టెప్పులు వేశాడు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కు ధీటుగా మహేష్ బాబు వేసిన హుక్స్టెప్ను థమన్ అనుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘సిగ్గుతో.. నన్ను నేనేనా’ అని కాప్షన్ ఇచ్చాడు. ‘నాతో కలిసి డాన్స్ చేసినందుకు శేఖర్ మాస్టర్కు ధన్యవాదాలు. సూపర్ స్టార్ మహేష్ గారికి ఇదే నా ప్రేమ’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరోసారి గని వాయిదా… ఆ సినిమా కోసమేనా ?

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -