Friday, April 26, 2024
- Advertisement -

ఆదిపురుష్ లో ప్రభాష్ పాత్ర పేరు రాముడు కాదు

- Advertisement -

హీరో ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆదిపురుష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు ఓం రౌత్.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు రాముడు కాదన్నారు. ‘వాల్మీకి రాసిన రామాయణంలోని మెయిన్ పాయింట్లను ‘ఆదిపురుష్’లో చూపిస్తాం. ఇందులో 7000 సంవత్సరాల క్రితం నాటి సెట్ వేశాం. రామాయణ కథని ఆధునిక కథా పద్ధతులతో చెప్పాను. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు రాముడు కాదు. రాముడికి మరో పేరు రాఘవ. అందుకే ఇందులో రాఘవుడు అని పేరు వాడాం. కృతి సనన్ పోషించిన సీత క్యారెక్టర్ జానకి పేరుతో పిలుస్తున్నాం.

సైఫ్ అలీ ఖాన్ రావణుడు పాత్రకు లంకేష్ అని పేరు పెట్టాం. ఈ పేర్లన్నీ కూడా “రామాయణం” నుంచి తీసుకున్నవే. ఆదిపురుష్ అంటే “మొదటి మనిషి” అని అర్ధం అయితే మేము “ఉత్తమ పురుషుడు” అనే అర్ధంతో తీసుకున్నాం” అంటూ ఆదిపురుష్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు డైరెక్టర్ ఓం రౌత్.

నాని నవ్వుల హోం మొదలైంది

పవన్ కల్యాణ్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఏపీ సర్కార్

ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్ట‌నున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -