Friday, May 9, 2025
- Advertisement -

‘రోగ్’ మూవీ రివ్యూ

- Advertisement -
Rogue Movie Review

పూరి జగన్నాథ్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి ఆయన ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తీసిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా..? ఇషాన్ ను పూరి ఎలా చూపించాడు..? అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

క‌ల‌క‌త్తా క‌మీష‌న‌ర్ కుమార్తె అంజ‌లి(ఏంజెలా)ను లవ్ చేసిన యువ‌కుడు(ఇషాన్‌). ఇషాన్ ప్రవ‌ర్త‌న చూసి అందరూ అతన్ని రోగ్ అంటూ ఉంటారు. లవ్ చేసిన వ్యక్తిని కాదని అంజ‌లి మ‌రో పోలీస్ ఆఫీస‌ర్‌(సుబ్బ‌రాజు)ను పెళ్లి చేసుకుంటుంది. దాంతో ఆ పెళ్లికి వెళ్ళి ఇషాన్ గొడవ చేస్తాడు. దాంతో జైలు పాల‌వుతాడు. ఆ జైలలో ఓ గొడవలో కానిస్టేబుల్(స‌త్య‌) కాళ్ళు విర‌గ్గొతాడు. అత‌ని ఫ్యామిలీ రోడ్డున ప‌డుతుంది. జైలు నుండి ఇంటికి వ‌చ్చిన ఇషాన్‌ను తండ్రి ఇంటి నుండి వెళ్ళ‌గొడ‌తాడు. ఆ తర్వాత ఇషాన్.. కానిస్టేబుల్ ఫ్యామిలీకి అండ‌గా ఉండాలనుకుంటాడు. ఆ కానిస్టేబుల్ చెల్లెలు అంజ‌లి(మ‌న్నారా చోప్రా) మొదట ఇషాన్‌ను ద్వేషించినా చివ‌ర‌కు ప్రేమిస్తుంది. అయితే మ‌ధ్య‌లో అంజ‌లిని ప్రేమించిన సైకో(అనూప్‌సింగ్‌) ఎంట్రీతో క‌థ మ‌లుపు తీసుకుంటుంది. ఆ సైకో నుంచి అంజలిని ఇషాన్ కాపాడుతుంటాడు. ఆ తర్వాత అంజ‌లిని ద‌క్కించుకోవ‌డానికి సైకో ఏం చేస్తాడు..? సైకోను అడ్డుకోవ‌డానికి ఇషాన్ ఏం చేసాడు..? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా పరిచయం అయిన ఇషాన్.. అద్భుతంగా నటించాడు. అతని లుక్స్, పూరి మార్క్ హీరోయిజంలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మాస్ హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఇషాన్ లో కనిపించాయి. హీరోయిన్స్ గా ఏంజెలా గ్లామర్ షోకే పరిమితం కాగా.. మన్నారా చోప్రా తన పరిథి మేరకు పరవాలేదనిపించింది. సింగం 3, విన్నర్ సినిమాల్లో స్టైలిష్ గా కనిపించిన అనూప్ రోగ్ లో సైకోగా బానే నటించాడు. విలనిజంతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తులసి తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.. సునీల్ కశ్యప్ అందించిన పాటలు పరవాలేదనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. హీరో, విలన్ క్యారెక్టర్ లకు డిజైన్ చేసిన థీమ్స్ వాళ్ల క్యారెక్టర్స్ ను మరింతగా ఎలివేట్ చేశాయి. ముఖేష్ సినిమాటోగ్రఫి, జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. తన్వి ఫిలింస్ నిర్మాణ విలువలు పర్వాలేదు.

మైనస్ పాయింట్స్ : 

రొటీన్ ఫార్ములాతో సినిమాలు తీస్తున్న పూరి జగన్నాథ్.. మరో సారి రోగ్ మూవీ విషయంలో అదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. రూడ్ హీరో క్యారెక్టర్, గ్లామర్ షోకే పరిమితమైన హీరోయిన్స్, బీచ్ సాంగ్స్, కామెడీ పండించే విలన్, అలీ కామెడీ ట్రాక్ ఇదే ఫార్ములాతో రోగ్ మూవీ తెరకెక్కింది. 

మొత్తంగా : 

హీరోగా ఇషాన్ కి ఈ సినిమా పర్వాలేదు అనిపించినా.. పూరి జగన్నాథ్ టేకింగ్ బానే ఉన్నా.. సినిమా కథలో దమ్ము లేకపోవడం ఈ సినిమాలో మైనస్ పాయింట్. ఒక్క మాటలో చెప్పాలంటే పూరి సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -