Friday, April 26, 2024
- Advertisement -

RRR Update: ఆర్ఆర్ఆర్ రీ స్టార్ట్ షురూ.. బరిలో దిగిన సీతా రామరాజు..!

- Advertisement -

దేశంలోనే అత్యంత అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు,తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పలు కారణాల వల్ల పలుమార్లు షూటింగ్ డిలే అయ్యింది. దీంతో విడుదల తేదీ కూడా పలుసార్లు వాయిదా పడింది. కరోనా తీవ్రత కారణంగా మరోసారి షూటింగ్ వాయిదా పడ్డ ఈ సినిమా కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాయిన్ అయినట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్, తన తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య లో ఓ కీలక పాత్రలో నటించేందుకు తన లుక్ మార్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో తన పాత్రకు సంబంధించిన లుక్ లోకి మారిపోయారు.

ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ కోసం ఇవాళ రామ్ చరణ్ అల్లూరి లుక్ లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ అలీమ్ హకీమ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగ్ ముగియనుంది. ఈ సినిమా జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా కానీ, లేదంటే సమ్మర్ సీజన్ లో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తవగానే రామ్ చరణ్ తిరిగి ఆచార్య షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Also Read

ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -