Saturday, May 4, 2024
- Advertisement -

అతి త్వరలో పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ? ఎవరికి ఇవ్వబోతున్నారు?

- Advertisement -

సుధీర్ఘ నిరీక్షణకు తెరపడబోతున్నాదా? ఇవాళో, రేపో టీ పీసీసీ అధ్యక్షుడు ఎవరు? అన్న విషయం తేలిపోనున్నాదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి చాలా రోజుల క్రితమే ఉత్తమ్​ కుమార్​ రెడ్డి టీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను అధిష్ఠానానికి పంపించారు. కానీ హైకమాండ్​ మాత్రం ఈ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఉత్తమ్​ కుమార్​రెడ్డినే తాత్కాలికంగా కొనసాగించాలంటూ కోరింది..

కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎంపిక విషయంలో నాన్చుడు వైఖరిని అవలంభించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్​ సైతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. కాంగ్రెస్​ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్​ నేతలను కలుసుకొని అభిప్రాయ సేకరణ చేపట్టారు. పీసీసీ ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందన్న వార్తలు వినిపించాయి. రేవంత్​రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఇంతలోనే మళ్లీ జీవన్​ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. రేవంత్​రెడ్డికి ప్రచార కార్యదర్శి పోస్టు ఇవ్వబోతున్నారన్న వార్తలూ వచ్చాయి. ఆ లోపే సాగర్​ ఉప ఎన్నిక రావడంతో .. ఈ ప్రక్రియకు మరోసారి బ్రేక్​ పడింది. అయితే తాజాగా పీసీసీ చీఫ్​.. పదవికి ఎండ్​ కార్డ్​ పడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం మాణిక్కం ఠాగూర్​ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు రేవంత్​రెడ్డి క్యాంపు మాత్రం.. తమ నేతకే పదవి రాబోతుందంటూ ప్రచారం మొదలు పెట్టింది.

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఉత్కంఠ నెలకొన్నది. రేవంత్​రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారని.. కోమటిరెడ్డి తదితర సీనియర్​ నేతలను నచ్చజెప్ప బోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవాళో రేపో ఈ ఉత్కంఠకు తెర పడనునన్నట్లు సమాచారం.

Also Read

తారక్​ పొలిటికల్​ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్​ 

ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -