Friday, April 19, 2024
- Advertisement -

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 27 మందికి కోవిషీల్డ్ కు బదులుగా కోవాక్సిన్..!

- Advertisement -

దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. మొదటి డోసు వేసుకున్న వాళ్లకు ఒక వ్యాక్సిన్ కు బదులుగా మరో వ్యాక్సిన్ వేయడం, ఒకేసారి రెండు డోసులు వేయడం, ఒక డోసుకు 0.5 ఎమ్ ఎల్ వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా అంతకు మించి వేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.

రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ లో ఓ నర్స్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన మహిళకు ఒకేసారి రెండు డోసులు వేసింది. ఈ సంఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నిన్న చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా గుడియానాంపల్లి లో వ్యాక్సింగ్ వేసే ప్రక్రియ చేపట్టారు.

ఈ శిబిరంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మొదటి డోసు కోవిషీల్డ్ వేసుకున్న 27 మందికి రెండో డోసుగా కోవాక్సిన్ వేశారు. ఆ తర్వాత జరిగిన తప్పును గుర్తించి వైద్య సిబ్బంది వారిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఒక వ్యాక్సిన్ కు బదులుగా మరో వ్యాక్సిన్ వేయించుకున్న గ్రామస్తులు, తమకు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Also Read

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం లేదు..! మరో అధ్యయనం

కాసేపట్లో అంత్యక్రియలు.. తల్లి ఏడుపు విని లేచిన పిల్లాడు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -