Monday, April 29, 2024
- Advertisement -

అది చూసి సమంత షాక్..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత తర్వాత తెలుగు, తమిళ ఇండస్గ్రీలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుకుంది. అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత సమంత ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెబుతుందని భావించారు.. కానీ పెళ్లి తర్వాత వరుస హిట్స్ సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇటీవల కరోనా వల్ల సినీమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత కొన్ని వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తుంది. ఓ వైపు యాడ్స్ తో బిజీగా గడుపుతుంది. తాజాగా సమంత తనకు సంబంధించిన ఓ భారీ కటౌట్‌ను చూసి షాక్ తిన్నది.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం సమంత హోస్ట్ గా మారుతోన్న విషయం తెలిసిందే.  ‘ఆహా’ పలు ఎంటర్‌టైన్ మెంట్ కార్యక్రమాలను రూపొందిస్తుండగా  ఇందులో భాగంగా సమంత హోస్టుగా ‘సామ్ జామ్’ అనే షోను రూపుదిద్దుకుంటోంది. సాధారణంగా స్టార్ హీరోలకు భారీ భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తుంటారు.. వాటిని చూసి తనకు ఎంతో సంతోషంగా ఉండేదని.. ఇప్పుడు తన కటౌట్ చూస్తే నిజంగా ఆనందం తన హృదయం ఉప్పొంగిపోయిందని అంటుంది.

ఆహా కార్యాలయంపై ఈ భారీ కటౌట్ పెట్టారు. ఆ వీడియోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘లేడీ సూపర్ స్టార్ సమంత బిగ్గెస్ట్ పోస్టర్ ఇది’ అంటూ ఆహా వీడియోలో పేర్కొంది. కాగా, ఈ నెల 13 నుంచి ఈ షో ప్రీమియర్‌లు ప్రారంభం అవుతాయి.

సమంత ఈ సినిమా లో విలన్ గా కనిపించనుందా..?

సిద్ధార్థ్ , సమంత ల మధ్య ఇంకా మనస్పర్థలు పోలేదా..!!

సమంతను పూజా హెగ్డే అంత మాట అన్నదా ?

క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత ఏమన్నాదంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -