Friday, April 26, 2024
- Advertisement -

చైతూ విషయంపై మాట్లాడదలుచుకోలేదు

- Advertisement -

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొంతకాలం ఒంటరిగా గడిపారు. తీవ్ర డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని కూడా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న తన వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయాలపై సామ్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సమంతకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ప్రసారం చేయరాదని మొట్టికాయలు వేసింది.

ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతను యాంకర్ చైతూతో విడాకుల అంశాన్ని ప్రస్తావించగా సామ్ సమాధానం ఇచ్చారు. డైవర్స్ తో తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని , జీవితంపై విరక్తి కలిగిందని చెప్పింది. మీడియాలో తనపై ప్రసార అవుతున్న వార్తలు మరింత మనోవేదనకు గురిచేశాయని తెలిపింది. తనపై జరిగిన తప్పుడు ప్రచారంతో చాలా బాధపడ్డాని అదే సమయంలో తాను మానసికంగా మరింత బలంగా తయారయ్యానని తెలిపింది.

ఇకపై చైతూతో విడాకుల గురించి మాట్లాడదులచుకోవడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను కెరీర్ పైనే ఫోకస్ చేయదలుచుకున్నానని వెల్లడించింది. ఇటీవల పుష్ప సినిమాలో ఐటం సాంగ్ తో దుమ్ములేపిన సామ్ ప్రస్తుతం పలు ద్విభాషా చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న యశోద సినిమాలో సమంత నటిస్తున్నారు.

విష్ణు సంచలన నిర్ణయం

రాజమౌళి ప్రస్టేటెడ్‌ డైరెక్టర్‌

సిరివెన్నెల పాట.. నందుల పూదోట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -