Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్నికల సమయంలో గుర్తురాని పవన్‌ ఇప్పుడు గుర్తుకొచ్చాడా ?

- Advertisement -

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కళ్యణ్ మద్దతు తెలిపారు. విశాఖ ఉక్క కార్మాగారాన్ని కాపాడుకోవాలని ఆయన చేస్తున్న ఒక్క రోజు దీక్ష ముగిసింది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభించిన పవన్‌ సాయంత్ర 5 గంటల వరకు దీక్ష చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు ఉక్కు కార్మాగార కార్మిక సంఘాలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.

వైసీపీలోని వ్యక్తుల నుంచి జనసేనా రాలేదన్నారు. తాను ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వంపై రాజకీయంగా మాట్లాడుతానని, అంతే కాని వైసీపీ నాయకులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయనన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారన్నారు.
కాని వైసీపీ ఎంపీలు, చేతకాని ఎంపీలు ఎందుకంటే పార్లమెంటులో నిరసనలు ఎందుకు చేయారు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రం దానిని తీసుకెళ్తానంటే తాను చూస్తూ ఉరుకోన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రధాని మోడీతో గొడవ పెట్టుకున్నట్లు పవన్‌ తెలిపారు.

మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఆపద వస్తే జనసేన పార్టీ గుర్తు వస్తుందని, అదే ఎన్నికల సమయంలో మాత్రం తాను గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజలకు తాను గుర్తు ఉన్నా లేకున్నా తాను మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తానని పవన్‌ పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు!

లోకేశ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..?

జనసేనాని దీక్ష వెనుక అసలు కథ ఇదా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -