Friday, April 26, 2024
- Advertisement -

‘మా’లో కీలక పరిణామం.. విష్ణు సంచలన నిర్ణయం

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో కీలక పరిణామం ​​చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన మా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయిన నటీనటులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంశంతో పాటు మోహన్ బాబు బూతులు తిట్టడం వంటి వార్తలు మీడియాలో హైలెట్ గా నిలిచాయి.

తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ తో సహా మరో 11 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. గతంలో రాజీనామాలను మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించారు. ఈ అంశంపై విష్ణు స్పందిస్తూ.. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని కోరినా సభ్యులు మాట వినలేదని చెప్పారు. అందుకే ఆమోదించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

అయితే మా సభ్యత్వానికి సైతం ప్రకాశ్ రాజ్, నాగబాబులు రాజీనామా చేశారు. దీనిపై విష్ణు స్పందిస్తూ వారి రాజీనామాలను ఆమోదించబోమని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ‘మా’ డెవలప్ మెంట్ పై మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పారు. అసోషియేషన్ కు నూతన భవనం నిర్మాణం గురించి పని చేస్తున్నామని అందరి అభిప్రాయాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నానని చెప్పారు. త్వరలోనే భవన నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

రాజమౌళి ప్రస్టేటెడ్‌ డైరెక్టర్‌

అప్పటి వరకు మహేష్‌తో సినిమా చేయను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -