- Advertisement -
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తరువాత వరుస పెట్టి సినిమాలు చేస్తుంది.ఇప్పటికే భర్త నాగచైతన్యకు జోడిగా ఓ సినిమాలో నటిస్తుంది.తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత.తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.తమిళ 96 సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష హీరో,హీరోయిన్లుగా నటించారు.
అక్కడ ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. మొదట ఈ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ ఆసక్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. తరువాత మరో హీరో గోపిచంద్ పేరు తెర మీదకు వచ్చింది.తాజాగా ఈ లిస్ట్‌లోకి యంగ్ హీరో శర్వానంద్ పేరు వచ్చి చేరింది.అయితే హీరోగా ఎవరు నటిస్తున్నప్పటికి హీరోయిన్‌గా మాత్రం సమంత ఫిక్స్‌ట.