కర్ణాటక రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది.విషం కలిపిన ప్రసాదం తిని 11 మంది మృతి చెందారు.కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సుళవాడిలో శుక్రవారం విషం కలిపిన ప్రసాదం తిని 11 మంది మృతి చెందిన ఘనటలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.గోపుర శంకుస్థాపన అనంతరం పంపిణీ చేసిన ప్రసాదం తిన్న 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 11 మంది మృతి చెందారు.ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలవడమే వల్లనే వీరు మరణించారని పోలీసుల ప్రాధమిక తెలింది. దీనిపై దర్యాప్తు చూపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
ఆలయ ట్రస్ట్ అధినేత నేత చిన్నప్పి.. గురస్వామి అనే వ్యక్తితో గోపురం కోసం శంకుస్థాపన చేయించారు. దీనిని దేవాంతి (చిన్నప్పి కజిన్) తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆలయంపై ఆయన పెత్తనాన్ని అంగీకరించని ఆయన మహాదేశ్ అనే వ్యక్తితో కలిసి ప్రసాదంలో విషం కలిపినట్టు పోలీసులు నిర్ధారించారు.పంపిణీ చేసిన ప్రసాదం తిన్న 70 మందిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరంతా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి,బీజేపీ నేత యడ్యూరప్పతోపాటు పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు.
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
- యుద్ధాన్ని ఆపండి.. పుతిన్‌తో ప్రధాని మోదీ
- అసాంఘిక కార్యకలాపాలు.. రంగంలోకి దిగిన ఎస్ఐ మౌనిక!
- కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా!
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
