Friday, April 26, 2024
- Advertisement -

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల బరువు పెరుగుతారా ?

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా అధికమవుతున్న నేపథ్యంలో పలు ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులకు పిల్లలకు ఆన్లైన్ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఇంటి నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో చాలామందికి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల శరీర బరువు పెరుగుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిలో సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్లవారిలో కొంత వరకు శరీర బరువు పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి నుంచే విధులు నిర్వహించడం వల్ల వారి ఆహార విషయంలో సరైన నియమాలు పాటించకపోవడం వల్లనే శరీర బరువు పెరుగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ విధంగా శరీర బరువు పెరగటం వల్ల ఇతర సమస్యలు కూడా చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి.

Also read:పన్నీర్ పాయసం ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేస్తే?

ఇంటి నుంచి విధులు నిర్వహించడం వల్ల మనం ఆఫీసుకు వెళ్లి వచ్చే శ్రమ తగ్గుతుంది, అదేవిధంగా ఇంట్లోనే తయారు చేసుకున్న భోజనం ఇతర స్నాక్స్ వంటి వాటిని తరచూ తింటూ ఉండటం వల్ల శరీర బరువు పెరుగుతారు. ఈ క్రమంలోనే మనం ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న కూడా సరైన ఆహార నియమాలు పాటించాలి. అదేవిధంగా మన శరీరానికి తగిన శ్రమను అనగా వ్యాయామం చేయటం, వాకింగ్ చేయడం వంటివి చేయడం ద్వారా మన శరీర బరువును అదుపులో పెట్టుకోవచ్చు నిపుణులు తెలియజేస్తున్నారు.

Also read:పనస గింజలతో రోగనిరోధకశక్తి నిజంగా పెరుగుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -