Thursday, April 25, 2024
- Advertisement -

స్టార్ మాలో ఇక సందడే సందడి.. వరుసగా అగ్ర హీరోల సినిమాలు..!

- Advertisement -

విడుదలైన కొత్త సినిమాలను ప్రసారం చేస్తుందని స్టార్ మా కు పేరుంది. మిగతా ఛానళ్లతో పోలిస్తే స్టార్ మా లో ఎక్కువగా కొత్త సినిమాలు ప్రసారం అవుతుంటాయి. బాహుబలి తరహా భారీ బడ్జెట్ సినిమాలను కూడా స్టార్ మా కొనుగోలు చేస్తుంటుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ కొనుగోలు చేయనంతగా స్టార్ మా కొత్తగా విడుదల కానున్న సినిమాలను కొనుగోలు చేసింది. అవి థియేటర్లలో విడుదలైన కొద్దిరోజుల తర్వాత స్టార్ మా లో ప్రసారం కానున్నాయి.

బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న అఖండ, ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ -అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప, రమేష్ వర్మ- రవితేజ ల ఖిలాడి, బొమ్మరిల్లు భాస్కర్- అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, శివ నిర్వాణ -నాని కాంబినేషన్లో వస్తున్న టక్ జగదీష్, శేఖర్ కమ్ముల నాగచైతన్యల లవ్ స్టోరీ, మేర్లపాక గాంధీ నితిన్ ల మాస్ట్రో, పరశురామ్ -మహేష్ బాబు సర్కారు వారి పాట వంటి అగ్ర సినిమాల శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది.

వీటన్నిటికంటే మోస్ట్ అవేటెడ్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రసార హక్కులను కూడా స్టార్ మా సొంతం చేసుకుంది. ఆ సినిమాలు థియేటర్లు ఓపెన్ కాగానే వరుసగా విడుదల కానున్నాయి. ఆ తర్వాత వన్ బై వన్ స్టార్ మా లో సందడి చేయనున్నాయి.

Also Read

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -