Wednesday, April 24, 2024
- Advertisement -

రాక్షసుడు హిందీ రీమేక్ లో స్టార్ హీరో..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా తెలుగు సినిమాల రీమేక్ బాటపట్టారు. అజయ్ దేవగణ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమాను రీమేక్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించగా, తాజాగా తెలుగులో హిట్ అయిన రాక్షసుడు సినిమాను స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. తమిళ్ లో విష్ణు విశాల్ అమలాపాల్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన రాక్షసన్ ఘన విజయం సాధించింది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు రీమేక్ అయిన రాక్షసుడుకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ థ్రిల్లర్ మూవీ ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది.

ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లోనే మొట్టమొదటి హిట్ గా ఈ సినిమా నిలిచింది. అంతకు ముందు ఆయన చేసిన అల్లుడు శ్రీను, జయ జానకి రామ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమాలకు పెట్టిన భారీ బడ్జెట్ కారణంగా హిట్ గా నిలవలేకపోయాయి. రాక్షసుడు సినిమా మాత్రం ఆయన కెరీర్లో తొలి హిట్ గా నిలిచింది.

కాగా ఈ సినిమాను హీరో, నిర్మాత అయిన హనీష్ తీసుకున్నారు. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయాలని భావించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా రీమేక్ చేయడానికి హనీష్ వెనక్కి తగ్గారు. దీంతో ఈ సినిమా రైట్స్ ని అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్. తెలుగులో రాక్షసుడు మూవీ కి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అతి త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

ఛత్రపతి హిందీ రీమేక్.. ఇక లేనట్టేనా? ఎక్కడ తేడా కొడుతోందే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -