ఇండస్ట్రీలో శర్వానంద్, రామ్ చరణ్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు రోజు కావడంతో రామ్ చరణ్ దగ్గరుండి కేక్ కట్ చేయించి పార్టీ ఇచ్చాడట. ఈ సందర్బంగా ఆ ఫోటోలను శర్వానంద్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కోసం ఇటీవల రామ్‌చరణ్ మారేడుమిల్లి వెళ్లాడు.

శుక్రవారం చిత్రీకరణ ముగించుకొని హైదరాబాద్ వచ్చేశాడు. మామూలుగా అయితే షూటింగ్ అయిపోయింది కాబట్టి వచ్చేశాడు అనుకోవచ్చు. అయితే శర్వానంద్ బర్త్ డే ఉంది కాబట్టి… ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చాడు. శర్వా తన బర్త్‌డే పార్టీ ఫొటోలు షేర్ చేసేసరికి ఈ విషయం బయటకు వచ్చింది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘మహాసముద్రం’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో శర్వానంద్ పవర్‌ఫుల్ గెటప్‌తో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు.. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూనే.. సక్సెస్ లు కూడా అందుకుంటున్నాడు శర్వానంద్.
మాట్టికుండ నీళ్ళు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?