Friday, May 3, 2024
- Advertisement -

అక్కడే దిక్కు లేదు.. ఇక్కడ కడతారు అంట: కేటీఆర్

- Advertisement -

హైదరాబాద్​లోని తెలంగాణ భవన్‌లో టి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం సమావేశానికి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఏప్రిల్ 27 నాటికి తెరాస ఆవిర్భవించి 2 దశాబ్దాలవు తుందని.. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టి.ఆర్.ఎస్ ను స్థాపించారని గుర్తు చేశారు. అప్పుడు కేసీఆర్‌కు మీడియా, మనీ, మజిల్ పవర్ లేదని.. నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణ సాధించారని చెప్పారు. కొందరు కేసీఆర్‌ను గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని.. తెరాసది సీఎంలను ఉరికించిన చరిత్రని చెప్పారు.

విద్యారంగానికి కేంద్రంలో ఉన్న బిజేపి చేసింది గుండు సున్నా అని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన సంస్థలను కూడా ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు నవోదయ విద్యాలయాలు కూడా దక్కలేదన్నారు. కొత్త వైద్య కళాశాలల్లో తెలంగాణకు మొండిచేయి చూపించారని ఆరోపించారు. బిజేపి కి ఎందుకు ఓటేయాలంటూ కేటీఆర్​ ప్రశ్నించారు.

విశాఖలో ఉక్కు పరిశ్రమను మూసేస్తున్నారని.. బయ్యారంలో బిజేపి ఉక్కు పరిశ్రమను కడుతుందా అని ప్రశ్నించారు. ఏమైనా అంటే దేశం కోసం.. ధర్మం కోసం అంటారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కోరారు. దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని తేల్చి చెప్పారు కేటీఆర్. ఒకరు ఎగిరెగిరి ఏమైపోయాడో తెలుసు.. అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయన్నారు.

రవిచంద్రన్​ అశ్విన్​ అరుదైన ఘనత..!

అభిమాని చెంప ఛెల్లుమనిపించిన బాలకృష్ణ.. ఎందుకో తెలుసా?

ఎంపీ, ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కోర్టు.. అందుకేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -