Friday, May 3, 2024
- Advertisement -

మాట్టికుండ నీళ్ళు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

- Advertisement -

మట్టి కుండ.. పేదోడి ఫ్రిజ్.. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఫ్రిజ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీళ్లు నోట్లో పోయాల్సిందే. ముఖ్యంగా వేసవిలో దాహం ఓ పట్టాన తీరదు. అందుకే తరచుగా చల్లగా ఉండే నీళ్లనే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతాం. అందుకే ఎంత ఖర్చైనా సరే ఫ్రిజ్ ను తెచ్చుకుని వాడుతుంటారు చాలా మంది. కానీ ఈ కాస్ట్లీ ఫ్రిజ్ కంటే.. పేదోడి ఫ్రిజ్ అయిన మట్టి కుండ నీళ్లు ఎంతో మంచివని వైద్యులు సూచిస్తున్నారు.

అందిరికీ అందుబాటులో దొరికే ఈ కుండల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే.. మీరు ఆ కరెంట్ ఫ్రిజ్ లను పక్కన పెట్టేసి మట్టి కుండనీళ్లనే తాగుతారు. సహజ సిద్దంగా కుండ నీళ్లను చల్లబరచడంతో పాటుగా మినరల్స్, విటమిన్స్ ను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ లో మనం కేవలం నీటిని చల్లబరుచుకోగలమేమో కానీ వడపట్టలేము. అదే మట్టి కుండ అయితే వాటికి ఉండే చిన్న చిన్న రంద్రాల ద్వారా నీటిని వడకట్టి చల్లబర్చడంతో పాటుగా.. సమ్మర్ లో వచ్చే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి.

ముఖ్యంగా వడ దెబ్బలు తగలుకుండా చేస్తుంది ఈ మట్టికుండ. దీంతో పాటుగా అతి దాహం, ఒళ్లు పేలడం వంటి సమస్యలు కూడా మన దరి చేరకుండా చేస్తాయి. అంతేకాకుండా శరీర వేడిని కూడా ఈ కుండ నీరు తగ్గిస్తుంది. అలాగే ఈ మట్టికుండ నీటికి ఉన్న పీహెచ్ బ్యాలెన్స్ ను మెయింటెయిన్ చెయ్యడంతో.. ఎసిడిటీ సమస్యను కూడా దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు కుండ నీటి వలన రావు. అలాగే ఆస్తమా వారు ఈ మట్టికుండ నీటిని తాగితే.. ఈ ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉంటుంది. రెగ్యూలర్ గా ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సో అందరికీ అందుబాటులో ఉండే ఈ మట్టికుండ నీటిని తాగి ఆరోగ్యంగా ఉండండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -