Sunday, April 28, 2024
- Advertisement -

శర్వానంద్ శ్రీకారం అక్కడ బోల్తా కొట్టినా.. ఇక్కడ మాత్రం హిట్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో సైడ్ యాక్టర్ గా నటించి హీరో స్థాయికి ఎదిగి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో శర్వానంద్ ఒకరు. కొత్త పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే తాజాగా శర్వానంద్ నటించిన “శ్రీకారం” సినిమా థియేటర్లలో విడుదలై పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. దర్శకుడు బి కిషోర్ దర్శకత్వంలో రైతే రాజు అనే కాన్సెప్టుతో రైతు గొప్పతనం వివరిస్తూ తెరకెక్కిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా థియేటర్ల దగ్గర బోల్తా కొట్టి ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది.

Also read:అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో బ్యూటీకి అవకాశం.. కథ అంత ఆమె చుట్టే!

శర్వానంద్ శ్రీకారం సినిమాను 14 రీల్స్ నిర్మించింది. ఈ సినిమాని తాజాగా సన్ నెక్స్ట్ డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలలో ఏ సినిమాకీ రాని వ్యూస్ శ్రీకారం సినిమాకు మిలియన్ వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ తెలియజేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ , హీరో సిద్ధార్థ కలిసి నటిస్తున్న “మహా సముద్రం” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Also read:అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -