Sunday, April 28, 2024
- Advertisement -

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో బ్యూటీకి అవకాశం.. కథ అంత ఆమె చుట్టే!

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ గా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీలో ప్రతి పాత్ర పట్ల స్పెషల్ కేర్ తీసుకొని ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీలో హీరో అల్లు అర్జున్ చెల్లెలి పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌ని సెలక్ట్ చేశాడట డైరెక్టర్ సుకుమార్. హీరో చెల్లెలు పాత్రతో ఈ మూవీ మొత్తం కథ ముడిపడి ఉండడం విశేషం.ఐశ్వర్య రాజేష్‌ తెలుగులో ఇదివరకే హీరోయిన్ గా కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇంకా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోందట.అలాగే ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇటీవల చిత్రానికి సంబంధించిన మేజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకోనీ డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడామొదలుపెట్టారు.పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 13న సినిమా విడుదల కానుందనీ చిత్ర యూనిట్ ప్రకటించింది.

అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?

గెటప్ శీను మొదటి సంపాదన తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -