Thursday, May 8, 2025
- Advertisement -

శివబాలాజీ భార్య ను వేధించింది ఎవరు.. అశ్లీల వీడియోలు…!

- Advertisement -

మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే ఎన్నో మహిళలపై జరిగిన ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతునే ఉన్నాయి. ఈ లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సినీ తారలకు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బయటకు తెలిపారు.

తాజాగా హీరో, బిగ్ బాస్ విన్నర్ శివబాలాజీ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని కొందరు తన భార్య మధుమితకు అసభ్యకరమైన మెయిల్స్ పంపుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు శివబాలాజీ. యూట్యూబ్ లో ఉన్న ఈ వీడియో లింక్ ఆధారంగా అశ్లీల, అసభ్య మెయిల్స్ పెడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపారు శివబాలాజీ. ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో సినిమా వార్తలతో పాటు, నటీనటులపై గాసిప్స్‌ రాస్తున్న విషయం అందరికి తెలిసిందే. న‌టుల‌పై ఊహాజనిత వార్తలు రాయడంతో తమ పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నాయని తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కూడా బాధితుల పట్ల ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తూ.. ధైర్యాన్నిస్తున్నారు. అందుకే ఇలాంటి ఆకతాయిలను మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఈ విషయంలో పోరాడేందుకు నా భర్త ఏంతో సపోర్ట్ చేస్తున్నారని మధుమిత అన్నారు. ఇక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -