Friday, March 29, 2024
- Advertisement -

తమిళ బిగ్‌ బాస్ నుంచి కమల్ హాసన్ అవుట్… కారణం ఏంటంటే ?

- Advertisement -

తమిళ బిగ్‌బాస్‌ నుంచి కమల్ హాసన్ వైదొలిగారు. తమిళ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ అయిన ‘బిగ్ బాస్ అల్టిమేట్’ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తానెందుకు తప్పుకుంటున్నానో కమల్ హాసన్ కారణం కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విక్రమ్’​ సినిమా, బిగ్​బాస్​ షో డేట్స్​ క్లాష్​ అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

బిగ్​బాస్​ యాజమాన్యంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు కమల్ తెలిపారు. త్వరలోనే ఆరో సీజన్ కు తిరిగి వస్తానని ఆ హామీ ఇచ్చారు. ‘బిగ్ బాస్ అల్టిమేట్’ 24 గంటల పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ప్రస్తుతం కమల్.. ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒక్కరోజు షూట్ మిస్సయినా డేట్ల సమస్య ఏర్పడుతుంది.

అంతేకాకుండా సినిమా నిర్మాణ వ్యయం పెరగడంతోపాటు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే షూటింగ్ ఇంకా జరుగుతున్నందున ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.

భీమ్లానాయక్‌పై కక్ష సాధింపు కొనసాగుతోందా ?

ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు.. ధనుష్‌ను ఉద్దేశించేనా ?

భారీ పరితోషకం తీసుకున్న దీపికా పదుకొణె

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -