Thursday, April 18, 2024
- Advertisement -

బిగ్ బాస్ కంటెస్టెంట్ కు బంపర్ ఆఫర్

- Advertisement -

బిగ్‌ బాస్‌ 5లో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న కంటెస్టెంట్‌ మానస్‌ నాగులపల్లికి బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ఆయనకు సినిమా ఆఫర్లు భారీగా వస్తున్నాయి. గతంలో మానస్‌ పలు సినిమాల్లో బాల నటుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం పలు సీరియల్స్‌, వెబ్‌ సిరీస్‌లలోనూ నటించారు.

ఈ యేడాది ఆయన నటించిన క్షీరసాగర మథనం సినిమా మానస్‌ బిగ్‌బాస్‌లోకి వెళ్లగానే ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమా మంచి ప్రేక్ష​కాదరణను పొందింది. దీంతో ఆయనకు హీరోగా గుర్తింపు లభించింది. మానస్‌ హీరోగా మూవీ 3జీ లవ్‌ స్టోరీ సినిమాను గతంలో ప్రతాప్‌ కోలగ‍ట్ల నిర్మించారు. రాజ్‌ ముదునూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

తాజాగా ఈ మానస్ హీరోగా ప్రతాప్ 5జీ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన బిగ్ బాస్ హౌజ్ నుంచి రాగానే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. బిగ్ బాస్ ద్వారా మానస్‌ సాధించిన పాజిటివ్ పేరు తమ సినిమాకు ప్లస్ అవుతుందని నిర్మాత భావిస్తున్నారు. వీటితో పాటు మరికొంద మంది మానస్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం.

నాగచైతన్య వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా..!

ప్రముఖ దర్శకుడితో గొడవపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్

షాక్‌లో మెగా ఫాన్స్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -