ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. ఒకప్పుడు మంచి సినిమాలు చేసినా ఇప్పుడు కొత్త హీరోయిన్ల రాకతో అవకాశాలు లేకపోవడంతో దిగాలు పడ్డ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతోంది. అంతేకదా తెలుగులో అవకాశాలు లేకుంటే బాలీవుడ్‌కు వెళ్లడం మన హీరోయిన్లకు అలవాటే. ఆ హీరోయినే శ్రుతి హాసన్. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ‘సంఘమిత్ర’ సినిమా నుంచి ఇటీవల శ్రుతి తప్పుకుంది. ఎందుకో తెలియదు. కానీ అప్పటి నుంచి ఈ అమ్మడికి అవకాశాలు లేవు.
ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమ్వాల్ హీరోగా హిందీలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతికి అవకాశం ఇచ్చారని సమాచారం. ఇటీవల దర్శక, నిర్మాతలు శ్రుతిని కలిసి కథ చెప్పడంతో ఆమెకు కథ బాగా నచ్చిందని, డేట్స్ కూడా ఇచ్చేసిందని తెలుస్తోంది. భారత్‌కు తిరిగి వచ్చిన ఓ ఎన్నారై జీవితం చుట్టూ ఈ సినిమా రూపొందిస్తున్నారని పుకారు.
ప్రస్తుతం శ్రుతిహాసన్ ‘శభాశ్ నాయుడు’ అనే ఈ ఒక్క సినిమాతోనే బిజీగా ఉంది.