యంగ్ రామ్ కెరీర్ ఒక హిట్ ,రెండు ప్లాప్‌లుగా సాగుతుంది. రామ్ ఇటీవలే హలో గురు ప్రేమ కోసమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సో సోగానే ఆడింది. ఈ సినిమా తరువాత టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ చిన్న ఎనౌన్స్‌మెంట్ చేశాడు పూరీ. రేపు సాయంత్రం 4 గంటలకు ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టుగా పూరి ట్వీట్ చేసింది. . ఆ సర్ ప్రైజ్ ఏమిటనేది ఇటు రామ్ అభిమానుల్లోను .. అటు పూరి అభిమానుల్లోను ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా పూరికి సరైన హిట్లు లేవు.
టెంపర్ సినిమా తరువాత పూరి తీసిన ప్రతి సినిమా ప్లాప్‌గా నిలిచింది. తన కొడుకు ఆకాష్‌ను హీరోగా మెహబుబా సినిమాను తీశాడు పూరి. ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో పూరికి అవకాశాలు తగ్గాయి. ఈ సమయంలోనే హీరో రామ్ పిలిచి మరి పూరికి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను పూరితో కలిసి హీరోయిన్ ఛార్మీ నిర్మిస్తోంది. ఈ సినిమా రామ్ కెరీర్‌లో 17వ సినిమాగా తెరకెక్కుతుంది.మరి ఈ సినిమాతో రామ్‌కు హిట్ ఇస్తాడో లేక తనతోపాటు ముంచేస్తాడో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
