Monday, May 5, 2025
- Advertisement -

నేను పూర్తిగా వెజిటేరియన్.. కానీ ఆ షాపులో నాపేరా.. సోను సూద్

- Advertisement -

ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో సినీనటుడు సోను సూద్ చేస్తున్న సహాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే కరోనా బాధితులకు సహాయం చేయడం కోసం తన పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసే విరాళాలను కూడా సేకరిస్తున్నారు. ఈ విధంగా సోనుసూద్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ఈ క్రమంలోనే కరీంనగర్ సుల్తానాబాద్‌కు చెందిన కన్నయ్య మటన్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన మటన్ షాపులో ఒక బంపర్ ఆఫర్ నడుస్తోంది.

సోనుసూద్ పేరుమీదుగా కన్నయ్య ఈ ఆఫర్ ప్రకటించాడు. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ ధర 700 నుంచి 800 వరకు ధర పలుకుతోంది. కానీ అన్నయ్య మాత్రం కేవలం కిలో మటన్ 650 రూపాయలకి విక్రయిస్తున్నాడు. ఇందులో యాభై రూపాయలు కరోనా బాధితుల సహాయం కోసం సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ కి విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఫ్లెక్సీ పెట్టడంతో ప్రజలు పెద్ద ఎత్తున కన్నయ్య మటన్ షాప్ కి చేరుకొని మటన్ విక్రయిస్తున్నారు.

Also read:ఆ వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్?

కన్నయ్య పెట్టిన ఈ ఆఫర్ తీన్మార్ వార్తల ద్వారా సోనుసూద్ వరకు చేరుకుంది. ఈ విషయంపై స్పందించిన సోనుసూద్…”నేను పూర్తిగా శాఖాహారిని… కానీ మటన్ షాప్ దగ్గర నా పేరా? ఏదైనా వెజిటేరియన్ షాప్ పెట్టుకుంటా అంటే తన వంతు సహాయం చేస్తా”అంటూ సోను సూద్ నవ్వుతున్న ఎమోజీతో ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:లీకైన చిరంజీవి ఫోన్ కాల్ సంభాషణ… మీడియా అధినేతతో అలా మాట్లాడిన చిరు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -