- Advertisement -

ఆ వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్?

- Advertisement -

“ఏం పిల్లో.. ఏం పిల్లడో” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి ప్రణీత ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందింది. ఎంతో అందం అభినయం ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మాతృభాష అయిన కన్నడలో కూడా ఈమెకు అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.అయితే పెళ్లి వార్తలపై స్పందించిన ప్రణీత ఏకంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పంచుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. లాక్ డౌన్ లోనే ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈమె పెళ్లి జరిగిపోయింది.

south indian actress Pranitha Subhash ties a knot with Nithin Raju in private ceremony

Also read:M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

కనకపుర రోడ్‌లోని రిసార్ట్‌లో నటి ప్రణితా సుభాష్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే తన పెళ్లి గురించి ప్రణీత మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రణీత నటించిన బాలీవుడ్ సినిమా హంగామా 2 ఒటీటీ ద్వారా విడుదల కానుంది.

Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -