Wednesday, April 24, 2024
- Advertisement -

లీకైన చిరంజీవి ఫోన్ కాల్ సంభాషణ… మీడియా అధినేతతో అలా మాట్లాడిన చిరు?

- Advertisement -

గత నలభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ అదే ఎనర్జీ తో సినిమాలతో దూసుకుపోతున్నారు. అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పుడు ప్రజా సేవ చేస్తూ ఉండే మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా బాధితుల కోసం ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేశారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి బ్యాంకులను ఏర్పాటు చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ప్రముఖ పత్రికలో ప్రత్యేకమైన కథనం ప్రచురితం అయింది. ఈ కథనంలో చిరంజీవి చేస్తున్న మంచి పని గురించి ప్రశంసిస్తూనే అభిమానుల మనసులోని భావనని కూడా బయట పెట్టారు.

Also read:లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

ఈ విధంగా చిరంజీవి గురించి ప్రత్యేకమైన కథనం ప్రచురించిన మీడియా సంస్థ అధినేత ముత్తా గోపాలకృష్ణతో చిరంజీవి ఫోన్లో సంభాషించారు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య ఎంతో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ ఫోన్ కాల్ లో చిరంజీవి మాట్లాడుతూ.. “మీరు చాలా చక్కగా రాశారు. నాకు గతంలో ఎన్నో ప్రశంసలు వచ్చినా.. కరెక్ట్ సమయంలో ఇది రావడం సంతోషంగా ఉంది. మీరు గొప్పలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు రాశారు’ అంటూ గోపాలకృష్ణతో చిరంజీవి సంభాషించినట్లు తెలుస్తోంది.

Also read:10 మంది బాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రభాస్ సినిమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -