Thursday, April 18, 2024
- Advertisement -

మిస్డ్ కాల్ ఇవ్వండి.. ఆక్సిజన్ పంపిస్తానంటున్న సోనూ సూద్!

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ కరోనా క్లిష్ట పరిస్థితులలో సోను సూద్ ఒక ఆపద్బాంధవుడిలా అవసరమైన వారందరికీ అవసరాలను తీరుస్తూ అందరి చేత రియల్ హీరోగా ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయానికి ఆక్సిజన్ అందక మరణిస్తున్నారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో సోను సూద్ కేవలం ఒకే ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఆక్సిజన్ పంపిస్తా అంటూ సోనుసూద్ గొప్ప మనసుతో ముందుకు వచ్చారు. మన దేశంలో ఆక్సిజన్ కొరత అధికంగా ఉండటం వల్ల ఫ్రాన్స్ తో పాటు పలు దేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్లకు ఆర్డర్ ఇచ్చిన సోనూసూద్ తాజాగా ఆక్సిజన్ కి సంబంధించిన 02261403615 నెంబర్ ఇచ్చారు.

Also read:మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది ఫాలోవర్స్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

ఎవరికైతే ఆక్సిజెన్ సమస్య ఉంటుందో ఈ నెంబర్ కు ఒక మిస్సేడ్ కాల్ ఇస్తే చాలు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్‌ మీ ఇంటి ముందు ఉంటుంది అంటూ సోనుసూద్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అయిన వారు ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే చాలు ఆక్సిజన్ మీ ఇంటి ముందు ఉంటుంది ఈ సేవలను పూర్తిగా ఉచితంగానే అందిస్తామంటూ పేర్కొన్నారు.

Also read:సుల్తాన్ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ను చూశారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -