ఆ వివాదం పై సమంత స్పందించక పోవడానికి కారణం అదే!

- Advertisement -

హీరోయిన్ సమంత ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన అందం, అభినయంతో వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో అగ్రనటిగా దూసుకుపోతోంది. అలాగే సమంత కెరీర్లో మొదటి సారి నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2”. ఈ యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వం వహించారు. ఇటీవలి ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ పై తీవ్రమైన విమర్శలు, వివాదాలు నెలకొన్నాయి. వివరాల్లోకి ఈ వెబ్ సిరీస్ తమిళ టైగర్లను అవమానిస్తూ, వారి మనోభావాలు దెబ్బతినేలా సమంత పాత్రను చిత్రీకరించారని, ఒక ప్రాంత ఉన్నతి కోసం పోరాడిన వారిని దేశద్రోహులుగా చూపించే ప్రయత్నం చేశారు అంటూ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ మేకర్స్ పై తీవ్రంగా మండిపడుతు బ్యాన్ చేయాలని నినాదాలు చేస్తున్నారు.

- Advertisement -

Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో సమంత ఎల్.టి.టి.ఇ రెబల్ రాజీ పాత్రలోఅద్భుతంగా నటించిందట.అయితే సమంత మాత్రం ఈ వివాదాలపై ఇప్పటి వరకు స్పందించలేదు. దానికి కారణం ఇంతటి సున్నితమైన అంశంపై సమంతా స్పందిస్తే కెరీర్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని, అలాగే తమిళంలో సమంత చేస్తున్న సినిమాల పై ప్రభావం ఉంటుందని కొందరి ఆలోచన. ఇదిలా ఉండగా ఈ విషయంపై స్పందించ వద్దని కోడలికి నాగార్జున సూచించాడట.ఇలా రకరకాల కథనాలతో సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.
ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ దర్శకత్వం “శాకుంతలం” అనే పౌరాణిక సినిమాలో నటిస్తోంది.

Also read:ప్రేయసి కోసం రూ.23 కోట్ల విలువచేసే విల్లా కొన్న స్టార్ హీరో?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -