Tuesday, May 7, 2024
- Advertisement -

ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూను పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై సమీక్ష చేపట్టారు. ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్‌ 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రోజు రోజుకూ కేసులు తగ్గుతున్నప్పటికీ.. కరోనా కట్టడికి మరికొన్ని రోజులు కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఏపీలో కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్.. రాష్ట్రంలో ప్రస్తుత కేసులు.. రికవరీ రేటు తదితర అంశాలపై చర్చించారు.

గతంతో పోల్చుకుంటే కరోనా కంట్రోల్ అయినప్పటికే.. మరింత కఠినంగా ఉండాల్సిందే అని ఆయన అధికారులకు చెప్పినట్టుు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా చైన్ తెగిపోవాలి అంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం జగన్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు అమలు చేస్తున్న సడలింపుల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు.

సాధారణ స్థితికి రావడానికి రెండు నెలల సమయం పట్టింది: తమన్నా

అల్లు శిరీష్ ఈసారైనా హిట్ కొడతాడా?

విరామం నాకు నేనుగా తీసుకున్నదే.. శృతిహాసన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -