Wednesday, May 22, 2024
- Advertisement -

”సంభవామి యుగే యుగే” కథలో ఊహించని ట్విస్ట్ ఇదే!

- Advertisement -
Spider Role in Mahesh Babu and Murugadoss Film

మహేష్ బాబు.. మురుగుదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు సినిమా సంబంధించి ఫస్ట్ లుక్.. టీజర్ ఏది రిలీజ్ చేయలేదు. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే మహేష్ సినిమాలో సాలీడ్లు వంటి పురుగులు ఉన్నాయట.

ఇదే ఈ సినిమాలో హైలేట్ గా తెలుస్తోంది. చూస్తోంటే ఈ మూవీ ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనే డౌటే వస్తోంది మరి. విషయంలోకి వెళ్తే.. ఈ చిత్రంలో కొన్ని రోబోటిక్స్ కూడా వాడుతున్నారట. వాటిలో ముఖ్యంగా ఒక రోబో సాలిపురుగు ఒకటి ఉంటుంది. ప్రస్తుతం విడుదల చేయబోతున్న టీజర్లోనే ఈ రోబో సాలీడును ప్రపంచానికి చూపించాలని మహేష్ డైరక్టర్ మురుగుదాస్ ఫిక్సయ్యారని టాక్. అందుకే లండన్ లో ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వారితో ఈ సాలీడు తాలూకు కంప్యూటర్ గ్రాఫిక్స్ 35 లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తున్నారట.

ఒకవేళ ఈ సినిమాలో మహేష్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి.. జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ఈ సాలీడు మనోడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుందేమో. సో ఏది ఏమైనా ఈ గ్రాఫిక్స్ తాలూకు వార్తతో మహేష్ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ మూవీకి ”సంభవామి యుగే యుగే” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు మొన్న నిర్మాత పివిపి ఇన్ డైరెక్టుగా చెప్పేశారు.

{youtube}n21Gwc8j3PA{/youtube}

Related

  1. మహేష్ భార్య రీ ఎంట్రీ.. ఏ సినిమాలో అంటే..?
  2. మహేష్‌ యంగ్‌గా కనిపించడానికి అది చేయించుకున్నాడట!
  3. పవన్ సినిమాలో మహేష్ చేసే సీన్ ఇదే!
  4. మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -